Mon Dec 23 2024 11:35:58 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే షకీల్ చెప్పిందంతా అబద్ధం
జూబ్లీహిల్స్ ప్రమాదానికి ఘటనకు కారణమైన కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ దేనని తేలింది
జూబ్లీహిల్స్ ప్రమాదానికి ఘటనకు కారణమైన కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ దేనని తేలింది. ఆయన నిజామాబాద్ లో ఉన్న మీర్జా ఇన్ ఫ్రా పేరిట ఈ కారును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఎమ్మెల్యే షకీల్ మూడు నెలల క్రితమే కొనుగోలు చేశారంటున్నారు. మూడు నెలల నుంచి కారు రిజిస్ట్రేషన్ లేకుండానే తిరుగుతుంది. మహేంద్రా కంపెనీకి చెందిన థార్ వాహనాన్ని కొనుగోలు చేసిన షకీల్ దానిని బిజినెస్ కోసం వినియోగిస్తున్నారు.
చివరకు ఒప్పుకుని....
జూబ్లీహిల్స్ లో ప్రమాదానికి గురై ఒకరి మృతికి కారణమయిన కారు తనదేనని ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు ఒప్పుకున్నారు. తొలుత తనది కాదని, స్టిక్కర్ ను ఫ్రెండ్ కు ఇచ్చానని చెప్పిన షకీల్, ఇప్పుడు రూటు మార్చారు. బాధితులకు వైద్య సాయం అందిస్తానని దుబాయ్ నుంచి చెప్పారు. కారును నడిపిన డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Next Story