Mon Dec 23 2024 07:59:38 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమపెళ్లి .. మిమ్మల్ని బతకనివ్వమంటూ సర్పంచ్..
కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని కావ్యతండ్రి ఆగ్రహంతో సదరు యువకుడి ఇంటితో పాటు.. వారి వివాహానికి సపోర్ట్ చేసిన..
కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో.. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం ఈ విషయం కావ్య ఇంట్లో తెలియడంతో మందలించారు. అయినా ఇద్దరం విడిగా ఉండలేమని భావించి కావ్య-రంజిత్ లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని కావ్యతండ్రి ఆగ్రహంతో సదరు యువకుడి ఇంటితో పాటు.. వారి వివాహానికి సపోర్ట్ చేసిన వారి బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడి చేశారు. రంజిత్ ఇంట్లో సామాన్లను తగులబెట్టారు. కాగా.. కావ్య-రంజిత్ లు హసన్ పర్తి పరిధిలోని ఓ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం హసన్ పర్తి పీఎస్ లో కావ్య తండ్రి ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. సుమారు 7 గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చినా కావ్య మనసు మారలేదు. ఆ కోపంతోనే కావ్య తండ్రి సర్పంచ్ రవీందర్.. రంజిత్ ఇంటిపై దాడి చేశారు. మిమ్మల్ని బ్రతకనివ్వమంటూ హెచ్చరించడంతో.. తమకు ప్రాణహాని ఉందంటూ జంట మీడియా ముందుకు రావడంతో విషయం వెలుగుచూసింది.
Next Story