Mon Dec 23 2024 05:56:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆఫీసు లోపలికి వచ్చినా హెల్మెట్లను తీయలేరు
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో ఉద్యోగులు
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీసులో ఉద్యోగులు తమ డ్యూటీ సమయంలో కూడా హెల్మెట్లు వేసుకునే గడుపుతూ ఉన్నారు. ఇంటి నుండి ఆఫీసుకు బైక్ ల మీద వచ్చాక కూడా హెల్మెట్లు తీయడం లేదు. ఓ శిథిలమైన ప్రైవేటు బిల్డింగ్లో ఆఫీసును నడిపిస్తున్నారు. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఆ భవనం వానాకాలం వస్తే చాలు పైనుంచి పెచ్చులు ఊడి కింద పడుతుంటాయి. ఎప్పుడు ఎవరి నెత్తి మీద ఏ పెచ్చు ఊడిపడుతుందోనన్న భయంతో హెల్మెట్లు పెట్టుకుంటూ ఉన్నారు.
బీర్పూర్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలో అధికారులు హెల్మెట్ ధరించడం ద్వారా తమను తాము రక్షించుకుంటూ ఉన్నారు. నాసిరకం భవనాలతో తమకు ముప్పు పొంచి ఉందని.. తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం చేయలేమంటూ ఇలా హెల్మెట్లతో ఆఫీసుకు వచ్చారు. గతంలోనే కార్యాలయంలో కొంతభాగం కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు ఏ క్షణంలో కూలుతుందో తెలియని పరిస్థితి కావడంతో కార్యాలయంలో పనిచేయడానికి వచ్చే ఉద్యోగులు హెల్మెట్లు పెట్టుకుంటూ ఉన్నారు. అక్కడి నుండి ఎంపీడీవో కార్యాలయాన్ని మార్చాలని ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
Next Story