Mon Dec 30 2024 17:03:44 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : రాములోరికి పవన్ కల్యాణ్ విరాళం.. ఎంతంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోధ్య రామమందిరానికి విరాళాన్ని ఇచ్చారు.
అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయింది. మరో రెండు రోజుల్లో ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే దేశమంతా అయోధ్య ఫీవర్ పట్టుకుంది. ఎప్పుడెప్పుడు రాముులోరిని దర్శించుకుందామన్న ఆతృత అందరిలోనూ కనపడుతుంది.
రామమందిరానికి...
ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరానికి విరాళాలు కూడా పెద్దయెత్తున వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటికే ప్రభాస్ యాభై కోట్లు విరాళంగా అయోధ్య రామమందిరానికి ఇచ్చారు. తాజాగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అయోధ్య రామమందిరానికి విరాళాన్ని ఇచ్చారు. ముప్పయి లక్షల రూపాయలను అందించారు. ముప్పయి లక్షల చెక్కును ఆర్ఎస్ఎస్ ముఖ్యులు భరత్ జీకి అందించారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది కూడా రాములోరికి పదకొండువేల రూాపాలయ విరాళాన్ని ఇచ్చారు.
Next Story