Mon Dec 23 2024 19:32:40 GMT+0000 (Coordinated Universal Time)
కొండగట్టులో కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలివచ్చారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో కొండగట్టు ప్రాంతం కిక్కిరిసిపోయింది. పవన్ కల్యాణ్ వాహనంపై నిల్చుని అభివాదం చేస్తూ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి చేరుకున్నారు. అయితే మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించిన పోలీసులు పవన్ పర్యటనపై ఆంక్షలు విధించారు.
పోలీసుల ఆంక్షలు...
పవన్ తో పాటు కేవలం ఐదుగురు మాత్రమే ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకోవాలని పోలీసు అధికారులు ఆదేశించారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కానీ పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో వారిని కట్టడి చేయడం కూడా కష్టసాధ్యంగా మారింది. వారాహి వాహనానికి పవన్ కల్యాణ్ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Next Story