Sat Apr 05 2025 02:46:24 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు ఇటలీ నుంచి పవన్.. చర్చలు షురూ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఇటలీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఇటలీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇంకా ఎన్ని సీట్లు అన్నది ఖరారు కాలేదు. ఇప్పటికి మూడు విడతలుగా బీజేపీ జాబితాలను విడుదల చేసింది. తొలి విడతలో 52 మందితోనూ, రెండో విడతలో ఒక అభ్యర్థిని, మూడో విడతలో 35 అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
సీట్లపై క్లారిటీ....
జనసేన ఇరవై స్థానాలను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. వీటిలో కూకట్పల్లి, శేర్లింగంపల్లి కూడా ప్రధానంగా ఉన్నాయి. దీనిపై ఈరోజు పవన్ కల్యాణ్ తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశముంది. బీజేపీతో పొత్తు చర్చలు ముగిసిన తర్వాత ఈరోజు పార్టీ కార్యాయలంలో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనను విడుదల చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏఏ సీట్లను జనసేనకు కేటాయించాలి? ఎన్ని సీట్లు అనేది పవన్ తో చర్చించన తర్వాతే ఖరారు చేస్తారని తెలిసింది.
Next Story