Sun Dec 22 2024 23:22:21 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు పక్కన చిన్నారులను చూసిన ఎమ్మెల్సీ ఆగి మరీ
నడిచి స్కూల్ కు వెళుతున్న చిన్నారుల ఇబ్బందులను చూసి జీవన్ రెడ్డి వారిని ఆపి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు
చిన్నారుల ఇబ్బందులు చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చలించిపోయారు. రోడ్డుపై నడిచి స్కూల్ కు వెళుతున్న చిన్నారుల ఇబ్బందులను చూసి జీవన్ రెడ్డి వారిని ఆపి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి తుర్కకాశినగర్ కు చెందిన విద్యార్థులు గురువారం రోడ్డుపై నడుస్తు వెళ్తుండగా జీవన్ రెడ్డి గమనించారు.
చలించిపోయిన ఎమ్మెల్సీ...
వారి పక్కనే తన వాహనాన్ని ఆపి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్కూల్ పిల్లలతో తాను మీ ఊరు వస్తానని, ఆ ఉరులోనే స్కూల్ పెట్టిస్తా నంటూ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. నేటి రోజుల్లో పిల్లలు చదువుకోవడానికి ఇంత దూరం నడిచి వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే తాను ఆ గ్రామానికి వచ్చి స్కూలును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story