Mon Dec 23 2024 18:56:14 GMT+0000 (Coordinated Universal Time)
సాయంత్రం కేసీఆర్ తో జార్ఖండ్ సీఎం భేటీ
కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, సాయంత్రం సీఎం కేసీఆర్ తో ..
హైదరాబాద్ : జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధ్యక్షుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, సాయంత్రం సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమవ్వనున్నారు. ఈ భేటీలో ఇద్దరు సీఎం లు జాతీయ రాజకీయాలపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story