Mon Dec 23 2024 01:21:53 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ 27వ వర్థంతి.. నివాళులు అర్పించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు .. ఎన్టీఆర్ సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి..
దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు తనవు చాలించి.. నేటికి 27 సంవత్సరాలు. నేడు 27వ వర్థంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు .. ఎన్టీఆర్ సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వారితో పాటు.. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
రాష్ట్రంలోని పలు కూడళ్లలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే.. పలు ప్రాంతాల్లో అన్నదానాలు నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. గ్రామ, మండలస్థాయిలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు నిర్వహించనున్నారు.
- Tags
- Jr NTR
- Kalyan Ram
Next Story