Mon Dec 23 2024 18:11:57 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్లెక్సీ ఏర్పాటులో వివాదం.. ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్నం
మామధ్య విభేదాలు లేవు అంటూ అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా అభిమానులు ఎంతో స్నేహభావంతో సినిమా రిలీజ్ ను సెలబ్రేట్..
కోదాడ : మరో మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఇప్పట్నుంచే ఆర్ఆర్ఆర్ థియేటర్ల వద్ద పండగ వాతావరణం తలపిస్తోంది. అభిమాన హీరోల భారీ కటౌట్లతో థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు. అసలు సిసలైన జాతర మొదలవ్వబోతోందంటూ.. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మామధ్య విభేదాలు లేవు అంటూ అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా అభిమానులు ఎంతో స్నేహభావంతో సినిమా రిలీజ్ ను సెలబ్రేట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కానీ.. ఇద్దరు అభిమానుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటులో వివాదం తలెత్తింది.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కట్టే పనిలో ఉన్నారు. కోదాడలోని ఓ థియేటర్ వద్ద తారక్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో ఇరు అభిమానుల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఆ వివాదం కాస్తా ఘర్షణకు దారితీయడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు పెట్రోల్ వంటిమీది పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. అక్కడే ఉన్న మిగతా అభిమానులు అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Next Story