Mon Dec 23 2024 09:58:44 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు.
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. అయితే తాత్కాలికంగానే విరమించినట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు, డీఎంఈతో నిన్న అర్థరాత్రి జరిపిన చర్చలలో కొంత వరకూ సానుకూలత కనిపించింది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
నేడు ఉత్తర్వులు...
కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. నేడు దీనికి సంబంధించిన రెండు ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించింది. స్టయిఫండ్ చెల్లింపుతో పాటు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే తిరిగి సమ్మెలోకి దిగుతామని వారు చెబుతున్నారు.
Next Story