Sat Nov 23 2024 08:57:18 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ను వదిలిపెట్టని జస్టిస్ చంద్రు
జస్టిస్ చంద్రు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా వదిలిపెట్టలేదు. ఆయనపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జస్టిస్ చంద్రు నిజాయితీకి నిదర్శనం. ఆయన జస్టిస్ గా నిష్పక్షపాతంగా చేసిన సేవలు ఎవరూ మరవలేనివి. జస్టిస్ చంద్రు తమిళనాడులో పనిచేసినా ఆయనకు ఇతర రాష్ట్రాల రాజకీయాలపై కూడా అవగాహన మెండుగా ఉంది. ఈమధ్య ఏపీ న్యాయవ్యవస్థపై జస్టిస్ చంద్రు కుండబద్దలు కొట్టారు. ఏపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థితో కంటే న్యాయవ్యవస్థతోనే ఎక్కువ పోరాడాల్సి వస్తుందని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. దీనిపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి.
ఆర్టీసీ సమ్మె విషయంలో....
అలాంటి జస్టిస్ చంద్రు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా వదిలిపెట్టలేదు. ఆయనపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కువ రోజులు అధికారంలో ఎవరూ ఉండలేరని జస్టిస్ చంద్రు అన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరును జస్టిస్ చంద్రు తప్పు పట్టారు. కార్మికులను కేసీఆర్ బెదిరించడం సరికాదని అన్నారు. యూనియన్లతో కాకుండా తాను ఉద్యోగులతో మాట్లాడతానని, ఎన్ని రోజులు సమ్మె చూస్తానని హెచ్చరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు.
Next Story