Thu Apr 03 2025 23:14:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మేడిగడ్డ బ్యారీజే అవకతవకలపై విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ విచాణ కొనసాగుతుంది

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుంది. జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఈ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ విచారణను వేగవంతం చేసింది. ఈరోజు విచారణ కమిటీ ఎదుటకు అధికారులు హాజరై తమ వివరణను అందించనున్నారు. విచారణకు పద్దెనిమిది మంది మాజీ అధికారులు హాజరవుతారని చెబుతున్నారు.
లిఖితపూర్వకంగా...
అధికారులు కమిషన్ కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలను అధికారులు వివరించనున్నారు. దీనిపై ప్రభుత్వం నియమించిన మాజీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీ విచాణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ తర్వాత ప్రభుత్వం బాధ్యులయిన వారిపై చర్యలు తీసుకోనుంది.
Next Story