Fri Feb 21 2025 21:35:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ కు జస్టిస్ పినాకి చంద్రగోష్
ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రగోష్ రానున్నారు. రేపటి నుంచి విచారణ ప్రారంభం కానుంది

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రగోష్ రానున్నారు. రెండు వారాలపాటు హైదరాబాదులోనే ఆయన ఉండనున్నారు. విచారణ చేయనున్నారు. రేపటి నుంచి తిరిగి కాలేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
రేపటి నుంచి బహిరంగ విచారణ...
గత కొద్ది రోజుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతుంది. ఈసారి విచారణకు ఐఏఎస్ అధికారులను కమిషన్ పిలవనుంది. విచారణ పూర్తి తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. వీలయినంత త్వరగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలన్న యోచనలో కమిషన్ ఉంది.
Next Story