Sun Dec 22 2024 22:19:37 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో ముందు విచారించాల్సింది చంద్రబాబుని : కేఏ పాల్
ఈ క్రమంలో మీడియా కేఏ పాల్ తో మాట్లాడగా.. వివేకా హత్యకేసులో సీబీఐ చేస్తున్న విచారణపై సంచలన ఆరోపణలు
వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నేడు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నేడు అవినాష్ బెయిల్ పై తీర్పు రానున్న నేపథ్యంలో కేఏ పాల్ కూడా హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో మీడియా కేఏ పాల్ తో మాట్లాడగా.. వివేకా హత్యకేసులో సీబీఐ చేస్తున్న విచారణపై సంచలన ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య జరిగినపుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు అని.. సీబీఐ ముందు విచారించాల్సింది చంద్రబాబుని అన్నారు. అలాగే ఆదినారాయణ రెడ్డిని కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబే దస్తగిరితో ఇదంతా చేయించాడని, దాని ఫలితంగానే దస్తగిరి జైలులో ఉన్నాడని ఆరోపించారు. చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, వివేకా రెండో భార్య ను సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినాష్ రెడ్డి తన తల్లి అనారోగ్యం కారణంగా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే.. తప్పించుకుంటున్నాడని ఆరోపణలు చేయడం తగదన్నారు. అవినాష్ రెడ్డికి వివేకా హత్యకు సంబంధం లేదని తెలుస్తుందని, అవినాష్ ను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేఏ పాల్ అన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ తీర్పు సందర్భంగా కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
Next Story