Tue Nov 05 2024 16:23:09 GMT+0000 (Coordinated Universal Time)
కేఏ పాల్ పై దాడి.. ఆ పార్టీ నేతల పనే అంటున్నారు..!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. కేఏ పాల్ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల జిల్లా వెళుతుండగా....
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. కేఏ పాల్ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల జిల్లా వెళుతుండగా, సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ వద్ద ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనం దిగి వారితో మాట్లాడుతుండగా, వారిలో ఓ వ్యక్తి కేఏ పాల్ పై దాడి చేశాడు. దాంతో పాల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. డీఎస్పీ చూస్తుండగానే ఈ దాడి జరిగింది.
తనపై దాడి జరిగిన నేపథ్యంలో కేఏ పాల్ పోలీసులపై మండిపడ్డారు. మీరు పోలీసులా? టీఆర్ఎస్ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు జీతాలు కేటీఆర్ ఇస్తున్నారా? ప్రభుత్వం ఇస్తోందా? అంటూ ప్రశ్నించారు. రైతులను అటు మోదీ గానీ, ఇటు కేసీఆర్ గానీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రైతుల కోసమే తాను వచ్చానని, తాను వస్తానని చెబితే వచ్చి తీరతానని కేఏ పాల్ చెప్పారు. రైతులను పరామర్శించడానికి వస్తే అడ్డుకుంటారా అని నిలదీశారు. తనను అడ్డుకుంటే చట్టపరంగా ముందుకు వెళుతానని, కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని పోలీసులను హెచ్చరించారు. తనతో దురుసుగా వ్యవహరిస్తే అందరిని సస్పెండ్ చేయిస్తానంటూ కేఏ పాల్ చెప్పుకొచ్చారు. కేఎల్ పాల్ చెంప చెళ్లుమనిపించిన వ్యక్తిని జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో కేసీఆర్ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ తన దగ్గర చేతులు కట్టుకుని నిల్చున్నారని చెప్పారు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని విర్రవీగవద్దని అన్నారు.
Next Story