Sun Dec 22 2024 19:34:10 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై నేడు
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ విచారణ ఈరోజు విచారణ జరుగుతుండటంతో ప్రధానంగా అవినాష్ రెడ్డి అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టులోనే వేసుకోవాలని సూచించడంతో ఇక్కడే దీనిపై నిర్ణయం వెలువడనుంది.
వైసీపీ క్యాడర్లో టెన్షన్....
నిన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను కూడా తెలంగాణ హైకోర్టు రద్దు చేయడంతో వైసీపీ క్యాడర్లో మరింత టెన్షన్ పెరిగింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తాను కూడా ఇంప్లీడ్ అయి తన తరుపున వాదనలు వినిపించడానికి సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Next Story