Mon Dec 23 2024 11:26:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సీబీఐ ఎదుటకు అవినాష్ రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఐదో సారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఐదో సారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు. అయితే హైకోర్టు మాత్రం ఈ నెల 25వ తేదీ వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ నిన్న ఆదేశించిన నేపథ్యంలో నేడు సీబీఐ అధికారుల ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు.
ఆడియో, వీడియో...
ముందస్తు బెయిల్ రావడంతో ఈ నెల 25వ తేదీ వరకూ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం లేదు. 25వ తేదీన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఈ నేపథ్యంలో నేడు విచారణలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ సాగనుంది.
Next Story