Sun Jan 12 2025 14:06:24 GMT+0000 (Coordinated Universal Time)
కల్వకోలులోని కాకతీయ శాసనాలు కాపాడుకోవాలి! పురావస్తు పరిశోధకుడు డా. ఈమని శివనాగిరెడ్డి
కొల్లాపూర్, జనవరి 16: కొల్లాపూర్ పట్టణానికి 10 కి. మీ. దూరంలో, పెద్ద కొత్తపల్లి మండలం, కల్వకోలులోని కాకతీయ గణపతి దేవుని కాలపు శాసనాన్ని కాపాడుకోవాలని పురవస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
కొల్లాపూర్, జనవరి 16: కొల్లాపూర్ పట్టణానికి 10 కి. మీ. దూరంలో, పెద్ద కొత్తపల్లి మండలం, కల్వకోలులోని కాకతీయ గణపతి దేవుని కాలపు శాసనాన్ని కాపాడుకోవాలని పురవస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామం బయట మట్టికోట గోడ లోపల ఉన్న నంది కోటేశ్వర స్వామి ఆలయం పక్కనున్న క్రీ. శ. 13వ శతాబ్ధనాటి శాసనం మట్టిలో కూరుకు పోయిందని, కాకతీయుల వంశ వృక్షాన్ని, ప్రోల రాజు విజయాలను, గణపతి దేవుని సామంతుడైన చెఱకు బోల్లయ రెడ్డి జమ్మలూరుపురం కలువకొలను గాను, పిలవబడిన కల్వకోలు పట్టడానికి ఏరువ సీమకు అధిపతి అన్న వివరాలు ఉన్నాయన్నారు.
చారిత్రక ప్రాధాన్యత గల ఈ శాసనం, క్రీ.శ. 1321 నాటి ప్రతాపరుద్రుని శాసనం, మట్టి కోటను కాపాడుకోవాలని కల్వకోలు గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Next Story