Mon Dec 23 2024 12:28:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుటకు?
నేడు కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. కమిషన్ ఎదుటకు కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు రానున్నారు.
నేడు కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. కమిషన్ ఎదుటకు కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు రానున్నారు. బహిరంగ విచారణ ద్వారా ఇంజనీర్లను కమిషనర్ విచారించనుంది. కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ ఇంజినీర్లను నేడు విచారించనున్నారు. నేటి నుంచి శనివారం వరకు 40 మంది కాళేశ్వరం ఇంజనీర్లను విచారించనున్నారు.
ఇంజినీర్లను...
కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందంటూ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ కొన్నాళ్ల నుంచి వివిధ అంశాలపై అనేక మందిని విచారిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు కమిషన్ చైర్మన్ సీపీ ఘోష్ కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లను విచారించనున్నారు.
Next Story