24 గంటలు టైమ్ ఇచ్చిన కల్వకుంట్ల కవిత
ఎమ్మెల్సీ కవిత.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కు 24 గంటల టైమ్ ఇచ్చారు. తన మీద చేసిన ఆరోపణలు నిరూపించడానికి
ఎమ్మెల్సీ కవిత.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కు 24 గంటల టైమ్ ఇచ్చారు. తన మీద చేసిన ఆరోపణలు నిరూపించడానికి 24 గంటల సమయం ఇస్తున్నట్లు చెప్పారు కవిత. ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారని.. 24 గంటలలో ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాయాలని కవిత సవాల్ విసిరారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన వాటిని ఇప్పుడు అర్వింద్ తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను, స్పైస్ బోర్డును తాను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకు వచ్చానన్నారు. తన భర్తపై ఆరోపణలు చేసి, రాజకీయాల్లో లేని ఆయనను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారన్నారు. తెలంగాణలో సంపద సృష్టించం అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు కవిత. అండర్ గ్రౌండ్ డ్రైనెజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసని.. ఎంపీ అర్వింద్ పిచ్చి ప్రేలాపణలు ప్రజలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.