Fri Jan 10 2025 09:11:11 GMT+0000 (Coordinated Universal Time)
కవిత ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఖాయమా?
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ లో లేవు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాస్ అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఎంపీటీసీ, కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి వారిద్దరూ నేడు ఫిర్యాదు చేయనున్నారు.
నేడు పరిశీలన...
నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. శ్రీనివాస్ ఎంపీటీసీ నవనీత, ఎంఐఎం కార్పొరేటర్ గజియా సుల్తానా సంతకాలను ఫోర్జరీ చేసినట్లు రుజువైతే శ్రీనివాస్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించే అవకాశముంది. అప్పుడు కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. నిజామాబాద్ స్థానిక సంస్థలలో టీఆర్ఎస్ కు సంపూర్ణమైన మెజారిటీ ఉంది. శ్రీనివాస్ నామినేషన్ పై మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story