Tue Dec 24 2024 02:55:52 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐకి కవిత మరో లేఖ
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. తాను ఈ నెల 6న విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు
ఎమ్మెల్సీ కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని ఆమె పేర్కొన్నారు. నిందితుల జాబితాను కూడా చేశానని తెలిపారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ కారణంగా ఈనెల 6న తాను హాజరుకాలేనని తెలిపారు. తాను వెబ్సైట్ లో ఎఫ్ఐఆర్ ను చూశానని, వివరణ అడిగేందుకే అయితే తాను ఈ నెల 6న హాజరు కాలేనని తెలిపారు.
6న తాను రాలేనని...
ఈనెల 11,12,14,15 తేదీల్లో హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని, సీబీఐ అధికారులు వచ్చి వివరణ తీసుకోవచ్చని తెలిపారు. ఏ తేదీన వస్తారో తనకు ముందుగానే తెలియజేయాలని కవిత కోరారు. తనకు తెలిసిన వివరాలన్నీ చెబుతానని, చట్టాన్ని తాను గౌరవిస్తానని, తాను చెప్పిన తేదీల్లో ఎప్పుడైనా సీబీఐ అధికారులు రావచ్చని కవిత తాను సీబీఐకి రాసిన లేఖలో కోరారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని ఆమె కోరారు.
Next Story