Fri Nov 22 2024 08:21:39 GMT+0000 (Coordinated Universal Time)
ముస్తాబయిన భద్రాద్రి
రేపు భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ వేడుకలకు భద్రాద్రి ముస్తాబయింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు
రేపు భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ వేడుకలకు భద్రాద్రి ముస్తాబయింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. మిథిలా స్టేడియంలోని మండపంలో సీతారామ కల్యాణం రేపు జరగనుంది. ఈ కల్యాణాన్ని చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ నెల 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది.
కల్యాణం కోసం....
సీతారామ కల్యాణం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి సమర్పిస్తారు. ఈ కల్యాణానికి మంత్రులతో పాటు అధికారులు, వీఐపీలు కూడా హాజరు కానుండటంతో ప్రత్యేక భద్రతను జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆన్లైన్ లో స్వామి వారి కల్యాణానికి సంబంధించి టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కన్నుల పండువగా జరగనున్న ఈ వేడుకను వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నారు.
Next Story