Breaking : కవిత కస్టడీ పొడిగింపు...లోతుగా విచారించాలని ఈడీ అభ్యర్థన
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరుపర్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మూడు రోజుల పాటు ఆమెను కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. ఈనెల ఇరవై ఆరోతేదీన ఆమెను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. గతంలో వారం రోజుల పాటు ఆమెను విచారించిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి కోర్టుకు హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశించడంతో కొద్దిసేపటి క్రితం కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకు వచ్చారు. కవితను కోర్టుకు తీసుకు వస్తారని తెలిసి ఆమె కుటుంబ సభ్యులు ముందుగానే కోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం మరో ఐదురోజులు కస్టడీకి అనుమతించాలని కోరారు. విచారించాల్సిన కీలక అంశాలున్నాయని, సమయం సరిపోనందున గడువు పొడిగించాలని కోరారు. కవిత మొబైల్ డేటాను కూడా విశ్లేషించాల్సిన అవసరముందని ఈడీ అధికారులు తెలిపారు.