Thu Dec 26 2024 13:20:40 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో చెప్పేసిన ఎమ్మెల్యే
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్య్యే కవ్వంపల్లి సత్యానారాయణ తెలిపారు
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎప్పుడో చెప్పేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్య్యే కవ్వంపల్లి సత్యానారాయణ తెలిపారు. తనకు గట్టి సమాచారం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, , అందులో మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా చెప్పారు. ఇప్పుడు ఇది తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు...
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఆ ఒక్క స్థానం మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి దక్కుతుందని తెలిపారు. దీంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలిపారు. అయితే ఆయన ఎవరో మాత్రం సత్యనారాయణ చెప్పలేదు. విలేకర్లతో చిట్ చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేయడంతో జులై రెండో తేదీన వాకిట శ్రీహరి నిజంగానే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా? అన్న చర్చ జరుగుతుంది. ఆరు స్థానాల్లో ఒక పేరు చెప్పడంతో మిగిలిన ఐదు స్థానాల్లో ఎవరెవరు మంత్రివర్గంలో చేరతారన్న చర్చ జరుగుతుంది.
Next Story