Wed Nov 27 2024 00:30:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వలలో ఎవరూ పడొద్దు : కేసీఆర్
మత విధ్వేషాల వలలో ఎవరూ పడవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారు. జగిత్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
మత విధ్వేషాల వలలో ఎవరూ పడవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారు. జగిత్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. కొందరు ఎనిమిదేళ్లలో అభివృద్ధి చేయకపోగా, ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించి ఎన్నికల్లో గెలుస్తున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల పైచిలుకు వరిని పండిస్తున్నామని తెలిపారు. అది తెలంగాణ వచ్చిన తర్వాతనే సాధ్యమయిందన్నారు. కేంద్రం పనితీరుతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఆయన అన్నారు. కేంద్రం నిర్వాకం వల్ల తెలంగాణ లక్షల కోట్లు నష్టపోతుందని ఆయన ఆవేదన చెందారు.
చెప్పింది చెప్పినట్లుగానే...
రైతులు తమ గ్రామాల్లోనే విక్రయించుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించిందని, దీని వెనక పరమార్థం ఉందని ఆయన వివరించారు. చెల్లాచెదురైన రైతాంగం తిరిగి ఒకచోట చేరి వ్యవసాయంలో అద్భుతమైన ప్రగతిని సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కేసీఆర్ వివరించారు. ఐదేళ్లలోపు మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి నల్లాను అందిస్తానని చెప్పానని, లేకుంటే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగనని కూడా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలా చెప్పడానికి ధైర్యం, సాహసం అవసరమని కేసీఆర్ అన్నారు. మాయ మాటలకు పడిపోవద్దని అన్నారు. చివరకు దీపావళి టపాసులు కూడా చైనా నుంచేనా? ఇదే మోదీ చెప్పిన మేక్ ఇన్ ఇండియా అని ఆయన ప్రశ్నించారు. ఎన్పీఏల పేరిట కార్పొరేట్ సంస్థలకు కోట్లు దోచి పెట్టారన్నారు. పేద ప్రజలకు సంబంధించిన సంస్థలను మాత్రం తెగనమ్ముతున్నారని ఫైర్ అయ్యారు.
Next Story