Wed Dec 25 2024 17:01:07 GMT+0000 (Coordinated Universal Time)
నిలదీయండి.. గళమెత్తండి
పార్లమెంటులో సమస్యలపై నిలదీయాలని, గళమెత్తాలని పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ పిలుపు నిచ్చారు
పార్లమెంటులో సమస్యలపై నిలదీయాలని, గళమెత్తాలని పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంటులో ఎండగట్టాలన్నారు. బీజేపీ విధానాలు దేశసమగ్రతకు ఆటంకంగా మారాయని తెలపిరు. ఎల్ఐసీ డబ్బులను అదానీ వంటి వారికి ఇస్తే ఆయన కంపెనీ షేర్లు పడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బీఆర్ఎస్ తో కలసి వచ్చే...
గవర్నర్ వ్యవస్థపైనా పార్లమెంటు ఉభయసభల్లో నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ తో వచ్చే పార్టీలతో కలసి ఆందోళన చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర విభజన సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దేశ సంపదను కార్పొరేట్ సన్నిహితులకు కట్టబెడుతుందని అన్నారు. ఫెడరల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని, అసెంబ్లీ నిర్ణయాలను సయితం కేంద్రం బేఖాతరు చేస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించడంపై ఆందోళనలు చేయాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు.
Next Story