Fri Dec 20 2024 11:49:22 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు
తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమన్నారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలువడం వెనక డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయన్నారు. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు. అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నదని పేర్కొన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తున్నదన్నారు.
భారత నూతన పార్లమెంట్ భవనానికి సైతం అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదని, భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని తాను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భారత నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని గతంలో కేసీఆర్ డిమాండ్ చేశారు.. ఇదే విషయమై ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు.
Next Story