Mon Dec 23 2024 11:51:23 GMT+0000 (Coordinated Universal Time)
అవును రాజ్యాంగం మార్చాల్సిందే.. రాయవయ్యా రాయీ
దేశంలో 19 శాతం మంది దళిత జనాభా పెరిగిందని, దానికి అనుగుణంగా రాజ్యాంగం మార్చాలన్నానని కేసీఆర్ చెప్పారు.
దేశంలో 19 శాతం మంది దళిత జనాభా పెరిగిందని, దానికి అనుగుణంగా రాజ్యాంగం మార్చాలన్నానని కేసీఆర్ చెప్పారు. బీసీలు కులగణనచేయాలని కోరుతున్నారని, కొత్త రాజ్యాంగంలో పొందుపర్చాలని కోరుకుంటున్నానని తప్పా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇందుకోసం రాజ్యాంగం మార్చామంటున్నాను తప్పా? నేను అంబేద్కర్ ను అవమానించలేదే? దళితుల కోసమే రాజ్యాంగం మార్చాలని తాను కోరుకుంటున్నానని రాయవయ్యా రాయీ... అని కేసీఆర్ ప్రశ్న అడిగిన మీడియా ప్రతినిధిని సూటిగా ప్రశ్నించారు.
అందుకే మార్చాలంటున్నా...
దళితులకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని కేసీఆర్ అన్నారు. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని, అందుకోసమే రాజ్యాంగం మార్చమంటున్నాని రాయి నీకు దమ్ముంటే. రాష్ట్రాల అధికారాలను, హక్కులను కేంద్రం కాలరాస్తుందని, అందుకే రాష్ట్రాల హక్కులు కాపాడుకోవడం కోసం రాజ్యాంగం మార్చమంటున్నాను తప్పా? యువతను సరైన దిశగా నడిపించేందుకు కొత్త రాజ్యాంగం కావాలని, చైనాలాగా భారత్ కూడా బాగుపడాలని కోరుకుంటున్నానని, దాని కోసం రాజ్యాంగం మార్చాలంటున్నాను తప్పా? అని ప్రశ్నించారు. తెలంగాణలాగా భారత్ మారడానికి కొత్త రాజ్యాంగం కావాలని అడుగుతున్నా తప్పా అని ప్రశ్నించారు.
మతం పేరిట....
ధర్మం, మతం పేరిట విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని కేసీఆర్ సూచించారు. హిజాబ్ ఉదంతంపై దేశం మౌనంగా ఉండటం తగదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇలా రెచ్చగొట్టే చర్యలు దిగడం సరికాదని కేసీఆర్ అన్నారు. దేశాన్ని మార్చడం కాదు బీజేపీని మార్చాలని అంటుంది తాను అందుకేనని చెప్పారు. దేశ భక్తి అంటే ఇదేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా దేశంలో మత విధ్వేషాలు రెచ్చగొట్టకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశంలో గవర్నర్ వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టించిందన్నారు. దీనిపై ఇతర ముఖ్యమంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా కట్టడి చేయాలని చూస్తుందన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో రాకూడదని కోరుకుంటునంటే కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు కాదని కేసీఆర్ అన్నారు.
- Tags
- kcr
- constitution
Next Story