Sun Nov 24 2024 15:29:39 GMT+0000 (Coordinated Universal Time)
KCR : బిడ్డా నల్లగొండతో వదిలిపెట్టం... నడిరోడ్డు మీద నిలబెడతాం..కేసీఆర్ మాస్ వార్నింగ్
నల్లగొండ సభ రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ అని కేసీఆర్ అన్నారు.
నల్లగొండ సభ రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ అని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాలు మనందరి జీవన్మరణ సమస్య అని అన్నారు. నల్లగొండ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ లేకుండా చేశామని చెప్పారు. ఓట్ల సమయంలో నంగనాచి కబుర్లు చెబుతారని, వారి మాయ మాటలు విని మోసపోవద్దని పిలుపు నిచ్చారు. కృష్ణా జలాల వదులుకుంటే నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదన్న కేసీఆర్ ఎవరో కొందరికి వ్యతిరేకంగా పెట్టిన సభ కాదని అని ఆయన అన్నారు.
ఫ్లోరైడ్ పోయి...
భగీరధ నీళ్లతో ఫ్లోరైడ్ పోయిందన్నారు. కొందరు సన్నాసులు తెలివిలేక ఈ సభ వారికి వ్యతిరేకమని అనుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నాడు ఒక ఏడాది నీటి వాటాలు సర్దుబాటు చేసుకోవాలని సూచించిందని, తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం నీళ్ల పంపిణీని పట్టించుకో లేదన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కేసు విత్ డ్రా చేసుకుంటే ట్రైబ్యునల్ వేస్తామంటే తాము ఉపసంహరించుకున్నామని చెప్పారు. పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నారన్నారు. కొత్త ప్రభుత్వం ట్రైబ్యునల్ వద్దకు పోయి వాదించలేకపోయిందన్నారు. పదేళ్లలో తాను తక్కువేమీ చేయలేదన్నారు.
పులి లాగా కొట్లాడతా....
తన కట్టె కాలే వరకూ తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలాగా కొట్లాడతా తప్ప పిల్లిలాగా పడుకోనని అన్నారు. మన నీళ్లు కాజేయాలనుకుంటున్న వారికి ఈ సభ ఒక హెచ్చరిక కేసీఆర్ అన్నారు. తెలంగాణలో తీర్మానం చేసి మమ అని అనిపించారు. ఉమ్మడి రాష్ట్రమే బాగుండేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు పదవులు, పైరవీలు కావాలి తప్ప ప్రజలు అవసరం లేదన్నారు. నీళ్లు లేకపోతే మన బతుకుల్లేవన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేయాలి? గత ప్రభుత్వం కన్నా మంచి పనులు చేయాలన్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని, మన వాటా శాశ్వతమని అన్నారు. కేసీఆర్ ను తిడితే ఓట్లుపడవని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోగానే కరెంట్ ఎక్కడకు పోయిందని ఆయన ప్రశ్నించారు. చేతకాని చవటల రాజ్యముంటే అలాగే ఉంటదని అన్నారు.
రైతు బంధు కూడా...
దామచర్లలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ధర్మల్ పవర్ స్టేషన్ ను కట్టామని, అయినా ఎందుకు విద్యుత్తు ఇవ్వలేదన్నారు. ఈరోజు చలో నల్లగొండతోనే ఆపమని, ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తామని అన్నారు. తెలివిలేక, నడపలేక, చేతకాక మందిమీద పడతారా? బిడ్దా వేటాడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. చివరకు రైతు బంధు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాదా? అని ప్రశ్నించారు. ఇష్ఠమొచ్చినట్లు మాట్లాడతారా? రైతులను చెప్పుతో కొడతామంటారా? ఎన్ని గుండెలు మీకు అంటూ ప్రశ్నించారు. కరెంటు లేదు... మంచినీళ్లు లేవు.. రైతు బంధు లేదు.. మాయలు చేసి ితిరుగుదామనుకుంటున్నారా? అని నిలదీశారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత తాము కూడా మేడిగడ్డ కు పోతామని, మీ జాతకాలు బయటపెడతామని హెచ్చరించారు. కేసీఆర్ను బద్నాం చేయాలని రైతుల పొలాల్ని ఎండబెడతారా? అంటూ ఫైర్ అయ్యారు.
Next Story