Fri Dec 20 2024 01:20:36 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇదే!!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. బీఆర్ఎస్ అధినేత కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. కేసీఆర్కు శస్త్రచికిత్స విజయవంతమైనట్లు యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఎనిమిది వారాల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు. కేసీఆర్ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి తన భార్య, తనయుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ వెంకట్ రెడ్డితో కలిసి పరామర్శించారు. శుక్రవారం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
యశోద హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మాజీ ముఖ్యమంత్రి శస్త్రచికిత్సను బాగా తట్టుకున్నారు. ప్రక్రియ అంతటా హేమోడైనమిక్గా స్థిరంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ను ఒక గదికి తరలించారని, అక్కడ ఆయన కోలుకుంటున్నాడని ఆసుపత్రి యంత్రాంగం తెలిపింది. ఆయనకు IV ద్రవాలు, రోగనిరోధక యాంటీబయాటిక్స్, మందులను ఇస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Next Story