Fri Dec 27 2024 08:50:15 GMT+0000 (Coordinated Universal Time)
KCR : యశోద ఆసుపత్రిలో కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు యశోద ఆసుపత్రిలో చేరారు. అర్ధరాత్రి జారి పడిపోవడంతో ఆయన కాలికి ఫ్రాక్చర్ అయింది
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు యశోద ఆసుపత్రిలో చేరారు. అర్ధరాత్రి జారి పడిపోవడంతో ఆయన కాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. కాలికి పంచె తగిలి కింద పడిపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం పది గంటల తర్వాత ఆయనకు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయన ఎడమ కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.
పంచె తగిలి...
కాలికి స్వల్పంగా గాయం కావడంతో ఆయనను వెంటనే హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాత్రికి కొన్ని పరీక్షలు నిర్వహించారు. కాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వైద్యులు అందిన సమాచారం ప్రకారం కేసీఆర్ కు పెద్ద ప్రమాదమేమీ లేదని, కాలికి స్పల్పంగా ఫ్రాక్చర్ అయిందని చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఆయన చికిత్స పొందాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు యశోదా ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
Next Story