Sun Dec 22 2024 07:30:20 GMT+0000 (Coordinated Universal Time)
కేరళ ఎక్స్ప్రెస్ కు తప్పిన ప్రమాదం
కేరళ ఎక్స్ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా పాపటపల్లి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం వద్ద ఈ ఘటన జరిగింది
కేరళ ఎక్స్ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పాపటపల్లి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం వద్ద ఈ ఘటన జరిగింది. వృద్ధుల కోసం నిర్మించిన చిన్న వంతెన మీదుగా బైక్ మీద వెళ్లేందకు ఒక యువకుడు ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో కేరళ ఎక్స్ప్రెస్ వస్తుండటం చూసి బైక్ ను రైలు పట్టాలపై వదిలేసి పారిపోయాడు.
బైకు ను పట్టాలపై...
అయితే కేరళ ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చి వాహనాన్ని ఢీకొట్టింది. వాహనాన్ని రైలు చాలా దూరం ఈడ్చుకుపోయింది. బైకులోని ట్యాంకు పగలి పెట్రోలు అంటుకోవడంతో కొంత మంటలు చెలరేగాయి. దీంతో కేరళ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. అయితే బైక్ నెంబరు సాయంతో గుర్తించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ధరావత్ వీరన్నగా గుర్తించారు. కేవలం నిర్లక్ష్యం కారణంగా తనకు ప్రాణాపాయం తప్పినా... కేరళ ఎక్స్ప్రెస్ కు కూడా అదే సమయంలో ముప్పు తప్పినట్లయింది.
Next Story