Tue Dec 24 2024 00:01:42 GMT+0000 (Coordinated Universal Time)
మొయినాబాద్ ఫాంహౌస్ ఆడియో లీక్
మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన ఎమ్మెల్యే కొనుగోలుపై కీలక అంశాలు వెలుగు చూశాయి. ఆడియో టేపులు బయటపడ్డాయి.
మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన ఎమ్మెల్యే కొనుగోలుపై కీలక అంశాలు వెలుగు చూశాయి. ఆడియో టేపులు బయటపడ్డాయి. రామచంద్ర భారతికి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మధ్య జరిగిన సంభాషణల ఆడియో బయటకు వచ్చింది. తనకు 24వ తేదీ వరకూ కుదరదని, బెడ్ రెస్ట్ లో ఉంటానని రామచంద్ర భారతి పైలట్ రోహిత్ రెడ్డికి తెలిపారు. 25 తర్వాత మీటింగ్ ప్లాన్ చేద్దామని, 26, 27 తేదీల్లో అయితే బెటర్ అని స్వామిజీ తెలిపారు. 24న గ్రహణం ఉందని, ఆ తర్వాత తాను హైదరాబాద్ కు వస్తానని రామచంద్ర భారతి తెలిపారు. నందు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని కూడా అన్నారు. ఇష్యూను త్వరగా క్లోజ్ చేయాలని, డీల్ లీక్ కాకుండా చూడాలని కోరారు.
నెంబరు 2 ఎవరు?
నందు చెప్పిన విషయాలు తమకు గుర్తున్నాయని, ముగ్గురం రెడీగా ఉన్నామని కూడా పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ముందుగా సమావేశమయితే బెటర్ అని ఆడియో టేపులో వినిపించింది. ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్నందున మిగిలిన ప్లేస్ లో కుదరదని, హైదరాబాద్ సేఫ్ ప్లేస్ అని రోహిత్ రెడ్డి తెలిపారు. నెంబర్ 2 ముందు కూర్చోబెడితే తనతో వచ్చే వారి పేర్లను చెబుతానని రోహిత్ రెడ్డి చెప్పినట్లు వినిపించింది. నందకుమార్ ఈ ప్రపోజల్ తెచ్చారని, మా ముఖ్యమంత్రి దూకుడుతో ఉన్నారని రోహిత్ రెడ్డి తెలిపారు. ఎవరికీ తెలియకుండా జరగాలన్నారు. తమ ఆర్గనైజేషన్ కు బలమైన నాయకులు కావాలని రామచంద్ర భారతి అన్నట్లు ఆడియోలో వినిపించింది.
Next Story