Mon Dec 23 2024 08:47:18 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు లభించినట్లు సమాచారం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోఅమెరికాలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అమెరికా లో గ్రీన్‌కార్డు మంజూరయినట్టు సమాచారం వచ్చింది.అమెరికాలోని కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తుకొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు చేసుకోగా మంజూరయినట్టు తెలిసింది.
ఎలా ముందుకెళ్లాలన్న దానిపై...
గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి కేసు దర్యాప్తు అధికారుల ఆరా తీస్తున్నారు. గ్రీన్‌కార్డు లభించడం కేసు దర్యాప్తుకు ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం పై పోలీసుల న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై ఎల్ఓసిని పోలీసులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కలర్ నోటీస్ కి జారీ కి ప్రయత్నం చేస్తున్నారు.
Next Story