Mon Dec 23 2024 09:19:09 GMT+0000 (Coordinated Universal Time)
పేపర్ లీకేజీ కేసు : సిట్ కు బదిలీ
టీఎస్ఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో అనేక అంశాలను ప్రస్తావించారు
టీఎస్ఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంకు ప్రభుత్వం అప్పగించింది. కమిషనర్ సీవీ ఆనంద్ ఈకేసును సిట్ కు బదిలీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. విషయంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో అనేక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన ప్రవీణ్ ఆఫీస్ కు వచ్చే చాలామందితో సంబంధాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రవీణ్ సెల్‌ఫోన్ లో చాలామంది మహిళల కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయని తెలిపారు. ప్రధాన సర్వర్ నుంచి పేపర్ కొట్టేసిన ప్రవీణ్ లూప్‌లో ఉన్న కంప్యూటర్ల ద్వారా పేపర్ తీసుకున్నారని పేర్కొన్నారు.
ఇద్దరికి మాత్రమే...
ప్రశ్నాపత్రం ప్రింట్ తీసి రేణుకకు ప్రవీణ్ షేర్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. తమకు తెలిసిన వారిలో కొందరికి ప్రశ్నాపత్రం ఉందంటూ రేణుక చెప్పిందన్నారు. రేణుక భర్త, ఆమె సోదరుడు కలిసి తెలిసిన వాళ్ల వద్ద ప్రచారం చేశారన్నారు. ఒక్కో పేపర్‌కి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ముందుకొచ్చారన్నారు. పేపర్ కొన్న ఇద్దర్ని తమ ఇంట్లోనే ఉంచి వారిచేత రేణుక ప్రిపేర్ చేయించిందని, పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి నేరుగా సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రం వద్ద వదిలిపెట్టారని పోలీసులు పేర్కొన్నారు.
Next Story