రహస్య మంతనాలు
భారతీయ జనతా పార్టీ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, మరో ఇద్దరు సీనియర్ నేతలు కలిసి
భారతీయ జనతా పార్టీ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, మరో ఇద్దరు సీనియర్ నేతలు కలిసి.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో గురువారం రహస్యంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో ఓ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. ఈటలతో పాటు ఇద్దరు ముఖ్యనేతలు తమ మొబైల్ ఫోన్లు, సొంత వాహనాలు, వ్యక్తి గత భద్రత సిబ్బందిని వదలిపెట్టి వేర్వేరు వాహనాల్లో ఫాంహౌస్ కు చేరుకున్నారు. ఈటల, శామీర్ పేట్ లోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 9 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ చేరుకున్నారు. గన్ మెన్లు, వాహనాన్ని వదలిపెట్టి మరో వాహనంలో ఫాంహౌస్ కు వెళ్లారని తెలుస్తోంది. పొంగులేటి బుధవారం రాత్రే ఖమ్మం నుంచి హైదరాబాద్ చేరుకోగా, జూపల్లి కొల్లాపూర్ నుంచి రెండ్రోజుల కిందటే వచ్చారు. బీజేపీ ముఖ్యనేతలు దాదాపు రోజంతా సమావేశమై వివిధ సమీకరణాలు, చేరికలపై చర్చించారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలపై చర్చ జరిగింది. ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం బీజేపీ నేతలు కొత్త ఫోన్లు, సిమ్ లు ఉపయోగించారని తెలుస్తోంది.