Tue Dec 24 2024 02:09:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కిసాన్ మహా పంచాయత్
తెలంగాణలో కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ కార్యక్రమానికి రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ హాజరుకానున్నారు
తెలంగాణలో కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ కార్యక్రమానికి రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ హాజరుకానున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో గత ఏడాదిగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు మద్దతుగా ప్రతి రాష్ట్రంలో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో ఈ కార్యక్రమం ఉంటుంది.
రాకేష్ టికాయత్...
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయచట్టాలను రద్దు చేసిందని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టాలను రద్దు చేస్తూ మంత్రి మండలి కూడా నిన్న ఆమోదించింది. కానీ పార్లమెంటులో మూడు చట్టాల రద్దు బిల్లులను పెట్టి ఆమోదించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళన ఏడాది పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ఈ ధర్నాలో బీకేయూ నేత రాకేష్ టికాయత్ పాల్గొంటున్నారు.
Next Story