Wed Dec 18 2024 23:12:46 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లో చోటు
కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు
తెలంగాణలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు లభించనున్నాయి. తెలంగాణలో కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాదయాత్ర కూడా నిర్వహించారు.
రెండు సార్లు గెలిచి...
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన బండి సంజయ్ ను ఈసారి కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. తెలంగాణలో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది పార్లమెంటు స్థానాలను బీజేపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Next Story