Mon Dec 23 2024 00:14:57 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్
ఇందిరాపార్క్ వద్ద 24 గంటల ఉపావాస దీక్ష చేస్తోన్న బీజేపీ
ఇందిరాపార్క్ వద్ద 24 గంటల ఉపావాస దీక్ష చేస్తోన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన్ను అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం వరకు దీక్ష చేస్తానని ఆయన చెప్పగా, పోలీసులు మాత్రం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి ఉందని చెబుతూ ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, కిషన్ రెడ్డికి మధ్య వాగ్వాదం కొనసాగింది. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
అంతకు ముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ 35 లక్షల మంది యువత జీవితాలను కేసీఆర్ నాశం చేశారని అన్నారు. తల్లిదండ్రుల వద్ద బంగారం అమ్మి, అప్పులు చేసి మరీ నగరంలో కోచింగ్ తీసుకొని, వీధిలైట్ల కింద, పార్కుల్లో చదువుకొని పరీక్షలు రాస్తే ప్రశ్నాపత్రాలు లీకై నిరుద్యోగ యువత బతుకులు ఆగమయ్యాయని అన్నారు. ఈ పాపం ఎవరిది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల భవిష్యత్ గురించి ఆలోచన లేని కేసీఆర్, బీజేపీ నేత బండి సంజయ్ పోరాటం చేస్తే కేసులు పెట్టారని ఆరోపించారు. అవినీతి కుంభకోణాలు మీవి.. చేతకాని తనం మీది.. లీకేజీలు మీవీ.. మాపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story