Mon Dec 23 2024 10:25:51 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష చెక్కును అందచేసిన కిషన్రెడ్డి
అంబర్పేట్ లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆర్థిక సాయం అందచేశారు
అంబర్పేట్ లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆర్థిక సాయం అందచేశారు. ఇటీవల వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. గ్రేటర్ హైదరాబాద్ పాలకుల నిర్లక్ష్యాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. చివరకు ఎనిమిది లక్షలు కార్పొరేషన్ నుంచి బాధితుడి కుటుంబానికి పరిహారం ప్రకటించింది. కార్పొరేటర్లు ఒక నెల వేతనాన్ని బాలుడి కుటుంబానికి ఇస్తామని తెలిపారు. తక్కువ మొత్తాన్ని పరిహారం ఇవ్వడంపై కూడా కిషన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు.
నిర్లక్ష్యం కారణంగానే...
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మరణించారని కిషన్ రెడ్డి తెలిపారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి తన సానుభూతిని ప్రకటించిన కిషన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరుపున లక్ష రూపాయల చెక్కును అందచేశారు. దీనితో పాటు తమ పార్టీ తరుపున మరో లక్ష రూపాయలు కూడా అందించామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story