Mon Dec 23 2024 14:11:46 GMT+0000 (Coordinated Universal Time)
కొల్హాపూర్ లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
కొల్హాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు
కొల్హాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్హాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో జరిగిన అవినీతి ఆరోపణలపై పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమని ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు.
అరెస్ట్ తో ఉద్రిక్తత.....
అయితే ఉదయమే జూపల్లి కృష్ణారావును మాత్రం ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే బీరం హర్హవర్థన్ రెడ్డి మాత్రం చేసిన సవాల్ మేరకు బయటకు రావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ను అరెస్ట్ చేసి తీసుకెళుతున్న వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పెద్దకొత్తపల్లికి ఎమ్మెల్యేను తరలించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story