Mon Dec 23 2024 07:05:54 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ పెద్ద బ్లాక్ మెయిలర్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో రాజీనామా చేయకుండా నాటకాలు ఆడావన్నారు. ఉపఎన్నికకు ఉత్తుత్తి రాజీనామా చేశాడన్నారు. రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చావని అన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తన మీద నిందలు వేయడమేంటని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాల్లో జైలుకు పోయావా? అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ చేేయడం నీ చరిత్ర కాదా? అని నిలదీశారు. వ్యాపారం లేకుండా వందల కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి తెచ్చావని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం టీడీపీని చంపేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు.
సోనియాను బలిదేవత అన్నదెవరు?
సోనియాను బలిదేవత అన్నది రేవంత్ రెడ్డి ఒక్కడే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై కూడా అనేక సార్లు తూలనాడారన్నారు. రేవంత్ వ్యాపారస్థులను బ్లాక్ మెయిల్ చేస్తాడని అన్నారు. పీీసీపీ పదవిని రేవంత్ డబ్బులిచ్చి కొనుక్కున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు, క్యాడర్ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఆయన కింద పనిచేసే పరిస్థిితి లేదన్నారు. సోనియా గాంధీని తాను ఎప్పుడూ అవమానపర్చలేదన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. జయశంకర్, కోదండరామ్ లను అవమానపర్చారని రేవంత్ రెడ్డి అన్నారు. తాను కాంట్రాక్టుల కోసమే పార్టీ మారినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.
Next Story