Mon Apr 21 2025 03:38:44 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీజేపీకి కోమటిరెడ్డి గుడ్ బై
భారతీయ జనతా పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు

భారతీయ జనతా పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2018 ఎన్నికల్లో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తితో ఆయన బీజేపీలో చేరారు. వెనువెంటనే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
మునుగోడు నుంచి...
అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. తర్వాత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
Next Story