Mon Dec 23 2024 07:24:36 GMT+0000 (Coordinated Universal Time)
21న చౌటుప్పల్ లో భారీ బహిరంగ సభ
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరాలనుకోవడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 21వ తేదీన బీజేపీలో చేరుతున్నానని, చౌటుప్పల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ లో మరికొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశముందని ఆయన చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకోవడం మోసం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు కూడా ఎవరూ ఏమీ మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తలో రకంగా మాట్లాడుతున్నారన్నారు. మా అన్నదమ్ములపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని చెప్పారు.
రేవంత్ బ్లాక్ మెయిలర్...
కాంగ్రెస్ పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా కష్టపడి పని చేశానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనమవుతుందని చెబుతున్నా తన మాట ఎవరూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తాను చేసేది ఏమీ లేదన్నారు. పార్టీలను అడ్డంపెట్టుకుని వందల కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి సంపాదించారని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. చిల్లర దొంగలు తమ కుటుంబంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ మారే స్వేచ్ఛ తనకు ఉందని తెలిపారు. ఒక దుర్మార్గుడి చేతిలో పార్టీ వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉండి కూడా ఏమీ చేయలేమనే పార్టీని మారానని చెప్పారు. టీఆర్ఎస్ ను ఓడించడం ఒక్క బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు.
Next Story