Mon Dec 23 2024 07:25:50 GMT+0000 (Coordinated Universal Time)
ఉప ఎన్నిక వస్తేనే మార్పు వస్తుంది
మునుగోడు ఉప ఎన్నికతో మార్పు వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తో ధర్మయుద్ధం చేస్తున్నానన్నారు.
మునుగోడు ఉప ఎన్నికతో మార్పు వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తో ధర్మయుద్ధం చేస్తున్నానని అన్నారు. ఇది కేసీఆర్ కు తనకు యుద్ధం కాదని, కేసీఆర్ కు మునుగోడు ప్రజలకు జరిగే ధర్మయుద్ధం అని కోమటిరెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలి అని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కేసీఆర్ తో తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు.
రేపటి నుంచి...
రేపటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికతోనే మార్పు వస్తుందని అన్నారు. ఉప ఎన్నిక రావాలా? వద్దా? అన్నది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. మరోవైపు దిగ్విజయ్ కొద్దిసేపటి క్రితం రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. కోమటిరెడ్డిని ఢిల్లీకి తీసుకు రావాల్సిందిగా రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచందర్ రెడ్డిని పంపారు. అయితే కోమటిరెడ్డి మాత్రం ఢిల్లీ వెళ్లేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.
Next Story