రాహుల్‌గాంధీ ర్యాలీలో ప్రమాదం.. మాజీ మంత్రి కొండా సురేఖకు గాయాలు
మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు
మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. రాహుల్ గాంధీ పర్యనలో భాగంగా ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. బుధవారం రాత్రి ములుగు నుండి భూపాలపల్లికి చేరుకున్న రాహుల్ గాంధీ భూపాలపల్లి సమీపంలోని జెన్కో గెస్ట్ హౌస్ లో బస చేశారు. అయితే గురువారం ఉదయం అక్కడి నుండే భారీ బైక్ ర్యాలీ ద్వారా భూపాలపల్లి మీదుగా కాటారంకు బయలుదేరారు. ఈ ర్యాలీలో సాధారణ కార్యకర్తలతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కొండా సురేఖ కూడా ఓ స్కూటీ నడుపుతూ రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో స్కూటీ అదుపు తప్పడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో తీవ్ర గాయాలైన సురేఖను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే భూపాలపల్లి నుండి స్కూటీ నడుపుతూ బైక్ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖ.. మేడిపల్లి సమీపంలోకి చేరుకోగానే ప్రమాదానికి గురయ్యారు.. స్కూటీ అదుపుతప్పి కింద పడడంతో కొండా సురేఖ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో తలకు, మొఖానికి.. రెండు చేతులకు, కాలికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడే ఉన్న గన్మెన్లు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు.