Mon Dec 23 2024 15:10:45 GMT+0000 (Coordinated Universal Time)
మైనంపల్లిపై క్రిశాంక్ తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. పలువురు బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ మైనంపల్లిపై విమర్శలు గుప్పించారు.
"మైనంపల్లి గారు
మీ అబ్బాయికి కోట్ల రూపాయల కార్లు కొన్నివడం మంచిదే.
కాని కొడుకు కోసం ప్రాంతాన్ని కొన్నివాలనుకోవడం సరికాదు.
మెదక్ లో హరీష్ గారు వేలు పెట్టొద్దని అనడానికి Medak జిల్లా మైనంపల్లి జిల్లాగా మారిపోయిందా?
ఇది ప్రజాస్వామ్యం,వేల కోట్ల డబ్బులున్న అహంకారంతో నోరు పారేసుకోకండి ." అంటూ ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారిలో క్రిశాంక్ కూడా ఉన్నారు. కానీ అతడికి దక్కకపోవడంపై కేటీఆర్ కూడా స్పందించారు. చాలా సామర్థ్యం, అర్హత ఉన్నకొందరికి సీట్లు దక్కకపోవడంపట్ల కేటీఆర్ నిరాశ వ్యక్తం చేశారు. మన్నే క్రిశాంక్ గురించి కూడా కేటీఆర్ ట్విటర్లో ప్రస్తావించడం విశేషం. దీనికి క్రిశాంక్ కూడా స్పందించారు. కేటీఆర్ అన్నా.. ఎప్పటికీ నేను మీతోనే ఉంటానని బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి నన్ను పరిచయం చేసింది మీరే అన్న అని క్రిశాంక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రమంతా తనకు అపారమైన ప్రేమను ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని తెలిపారు. మీరు లేకపోతే తన రాజకీయ జీవితం 2018-19లోనే ముగిసిపోయేదని.. అన్ని విధాలుగా మీరు తనకు దారి చూపారని క్రిశాంక్ స్పష్టం చేశారు.
Next Story