Mon Dec 23 2024 09:53:16 GMT+0000 (Coordinated Universal Time)
Train : కృష్ణా ఎక్స్ప్రెస్ కు తప్పిన ముప్పు
కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద రైలు పట్టా విరగడంతో రైలను నిలిపేశారు
కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద రైలు పట్టా విరగడంతో రైలను నిలిపేశారు. పెద్ద శబ్దం రావడంతో అధికారులను ప్రయాణికులు అప్రమత్తం చేశారు. దీంతో రైలును వెంటనే నిలిపి వేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఆలేరు సమీపంలోని రైలు పట్టాలు విరిగిపోయాయి.
రైలు పట్టాలు విరగడంతో...
ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును ఆలేరు స్టేషన్ లో నిలిపేశారు. వెంటనే రైలు పట్టాలకు సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండటంతో రైలు పట్టాలు విరిగిపోయాయా? మరెవరైనా కావాలని చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story